బాలానగర్, నవంబర్ 10 : మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల నుంచి నిరసన సెగ తగిలింది. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం పంచాంగులగడ్డ తండా లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాని కి హాజరైన ఎమ్మెల్యేను ట్రిపుల్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులు చుట్టుముట్టారు.
రోడ్డు నిర్మాణంలో విలువైన భూములు పోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. గుండేడు శివారులోని సర్వే నంబ ర్లు 24 నుంచి 183 వరకు, మాచారం శివారులోని సర్వే నంబర్లు 26 నుంచి 62 వరకు వందలాది మంది రైతుల భూములు ట్రిపుల్ఆర్లో పోతున్నాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు.