శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో చేపట్టిన భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన మంగళవారంతో 21వ రోజుకు చేరుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉద్యోగులు మూడు వారాలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకు న్యాయం చేయాలని బీటీఎన్జీవోలు, ఉద్యోగులు, పెన్షనర్లు నినదించారు.
‘ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి’.. ‘తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జిందాబాద్’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. తమ స్థలాలు తమకు అప్పగించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణ అధ్వర్యంలో కొనసాగుతున్న ఈ ఆందోళనలో ఉపాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, సెక్రటరీ మల్లారెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, డైరక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, రషీదా బేగం, సంధ్య, ఏక్నాథ్గౌడ్, నాయక్, దామోదర్ పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.