శేరిలింగంపల్లి, డిసెంబర్ 29 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల నిరసన దీక్షలు సోమవారం 167వ రోజుకు చేరాయి. సోసైటీ కార్యాలయం అవరణలో ఉద్యోగులు సమావేశానికి 33 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, సత్యనారాయణగౌడ్ మాట్లాడారు.
హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో తనతోపాటు ఏ1 ముద్దాయిగా ఉన్న సీఎం రేవంత్ ఈడీ కోర్టులో వి చారణకు హాజరుకావాలని జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఎస్లో సోమవారం మీడియాతో మా ట్లాడారు. నాంపల్లిలోని ఈడీ కోర్టులో ఓటుకు నోటు కేసు మంగళవారం విచారణకు రానున్నదని, ఈ కేసులో ప్రధాన ముద్దాయిలైన రేవంత్, ఉదయ్‌సింహా, వేంనరేందర్‌రెడ్డి, వేంకీర్తన్రెడ్డి తదితరులు హాజరుకాకపోవడంపై గతంలో న్యాయమూర్తి ఆగ్రహం వ్య క్తంచేశారని తెలిపారు. ప్రతిసారి ఏవో సాకులు చెప్తూ రేవంత్ తప్పించుకుంటున్నారని ఆరోపించారు. సరైన దర్యా ప్తు జరగకుండా తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని విమర్శించారు.