సుల్తాన్ బజార్, జూలై 19 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా గోపన్‌పల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోల స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడాన్ని నిరసిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం శనివారం నాలు గో రోజుకు చేరుకుంది. ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్యర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యోగు లు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ నిరసన కార్యక్రమంలో న్యా యం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఉద్యోగులు నినాదాలు చేశారు. ప్ర భుత్వం స్థలాన్ని బీటీఎన్జీవోలు అప్పగించకపోతే వేలాదిమంది ఉద్యోగులతో ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోస్ గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీకి సర్వే నంబర్ 36 లో 142 ఎకరాల 11 గుంటలు కేటాయించారు. సొసైటీ సభ్యులు కోట్ల రూపాయలు వెచ్చించి మార్టిగేజ్, లేఅవుట్ చే యించారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ప్రయోజ నం లేకుండా పోయిందని వాపోయారు.