హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అరుదైన కళలను గుర్తించి, కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నాని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రవీంద్రభారతిలో సావిత్రి బాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లకు గ్లోబల్ టీచర్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కళాకారులను గుర్తించి వారికి సరైన ప్రోత్సాహం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట గ్రహీతలు, శారదా కథలు పాడే అరుదైన కళాకారులు జంగమ్మ, శివమ్మలను మంత్రి అభినందించారు.