హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): అగ్నిమాపక శాఖలో త్వరలో ప్రమోషన్లు చేపట్టనున్నారు. మే నెలలో ఇద్దరిని ఫైర్ రీజినల్ ఆఫీసర్లుగా ఆ శాఖ ఏడీజీ వై నాగిరెడ్డి ప్రమోషన్ కల్పించారు. ఇక ఫైర్‌మెన్ టు డ్రైవర్ ఆపరేటర్ ప్రమోషన్లకూ ఆయన పచ్చజెండా ఊపారు.
దీంతో దాదాపు 22 మందికి త్వరలోనే డ్రైవర్ ఆపరేటర్‌గా ప్రమోషన్ రానున్నది. ఇప్పటికే ప్రమోషన్ల ప్రక్రియ పనులు పూర్తవగా, ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎప్పటి నుంచో వేచిచూస్తున్న ఈ ప్రమోషన్ల ఫైల్‌కు ఇక మోక్షం లభించనున్నది. ఏప్రిల్‌లో ఏడుగురికి అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్లు (ఏడీఎఫ్‌ఓ)గా పదోన్నతి లభించింది.