హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : వాణిజ్య పన్నులశాఖలో పదోన్నతులు కల్పించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. గతంలో జీవోలు జారీచేశారని, పదోన్నతుల ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం సమర్పించింది.
డీపీసీలు ఆమోదించినా పెండింగ్‌లో పెట్టారని, మంగళవారంతో సంవత్సరం పూర్తికానుండటంతో అంతలోపు పదోన్నతులు కల్పించాలని కోరింది. ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, అసోసియేట్ అధ్యక్షుడు బీ శ్యామ్, మల్లేశం, పీ శ్రీరాంరెడ్డి, రామారావు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.