హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) పరిధిలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు(డీసీహెచ్ఎస్), జాయింట్ కమిషనర్ల ఉద్యోగోన్నతుల పరిమితి వయసును 56 నుంచి 59కి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసు 58 ఉన్నప్పుడు వీరి ఉద్యోగోన్నతి పరిమితి వయసు 56గా ఉంది.