హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతులపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో అక్టోబర్ 6లోపు నివేదిక అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు, పర్యవసానంగా రావాల్సిన సీనియార్టీలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్నారు.
దీంతో నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని గతంలో అధికారులకు హైకోర్టు ఆదేశించింది. వీటిని అమలు చేయలేదంటూ తెలంగాణ విద్యుత్తు ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ధికరణ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని జస్టిస్ అభినంద్ కుమార్ షావిలీ ఇటీవల విచారణ చేపట్టారు. వాదనల తర్వాత నివేదిక అందజేయాలని విద్యుత్ సంస్థలను హైకోర్టు ఆదేశించింది.