హైదరాబాద్, మార్చి26 (నమస్తే తెలంగాణ) : గడువులోగా పనులు పూర్తికాకుంటే సంబంధిత పథకాల నుంచి ప్రాజెక్టులను తొలగిస్తామని అన్ని రాష్ర్టాలకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి వీఎల్ కాంతారావు హెచ్చరించారు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర జల్‌శక్తిశాఖ ఆధ్వర్యంలో సదరన్ స్టేట్స్ కాన్ఫరెన్స్‌ను ఎంసీహెచ్ఆర్డీలో గురువారం నిర్వహించారు.