ఖనిజాల గని టీఎస్ఎండీసీ
ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అత్యంత విజయవంతంగా గనుల అన్వేషణ, గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది.
- వెలికితీతలో అద్భుత విజయాలు
- ఇసుక ద్వారా భారీగా ఆదాయం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో అత్యంత విజయవంతంగా గనుల అన్వేషణ, గుర్తింపు, అభివృద్ధి పనులు చేపట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నది. 2014 నుంచి టీఎస్ఎండీసీ ద్వారా ప్రభుత్వానికి రూ.5,072.76 కోట్ల ఆదాయం సమకూరింది. 98 ఇసుక రీచ్‌లను నిర్వహిస్తూ పారదర్శకంగా తక్కువ ధరకే ఇసుకను ప్రజలకు సమకూరుస్తున్నది. టీఎస్ఎండీసీని కేంద్ర గనుల శాఖ జనవరి 5, 2016న నేషనల్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (ఎన్ఈఏ)గా గుర్తించింది. ఈ సంస్థ తెలంగాణతోపాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో 10 మైనింగ్ అన్వేషణ ప్రాజెక్టు పనులు పూర్తిచేసింది. టీఎస్ఎండీసీకి ఐఎస్వో 9001:2015 గుర్తింపు ఉండటం గమనార్హం. ఉత్తమ సేవలకు స్కోచ్ అవార్డు, ఏఎస్ఐఏ-ఈఎల్ఈటీఎస్ టెక్నోమీడియా అవార్డులను అందుకొన్నది.
టీఎస్ఎండీసీ చేపట్టిన ప్రాజెక్టులు
- కరీంనగర్ జిల్లా శంకర్‌పట్నం మండలంలోని కొత్తగట్టు గ్రామంలో డైమెన్షనల్ స్టోన్ గ్రానైట్ క్వారీలు.
- రంగారెడ్డి జిల్లా యాచారంలో 266 హెక్టార్లు, బండ రావిర్యాలలో 26.88 హెక్టార్లలో రోడ్డు మెటల్ క్వారీలు.
- బండ రావిర్యాలలో 33.22 ఎకరాల్లో మైనింగ్ అనుమతులు. మరో 33.23 ఎకరాల్లో మైనింగ్ నిర్వహణకు కృషి.
- యాచారం రోడ్డు మెటల్ క్వారీ కోసం 39 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డు మెటల్ యూనిట్ ఏర్పాటుకు అనుమతులు
- మంచిర్యాల జిల్లాలోని దేవాపూర్‌లో 210 హెక్టార్లలో సున్నపురాయి గని కాంట్రాక్టు
- సూర్యాపేట జిల్లాలో గ్రానైట్ రైజింగ్ కమ్ సేల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 9.90 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ క్వారి లీజు.
- క్వార్ట్జ్, ఫెల్డ్ స్పార్స్ క్వార్ట్జ్ ఖనిజం వెలికితీసేందుకు ప్రభుత్వానికి దరఖాస్తు.
- మహబూబ్ నగర్ జిల్లాలో 195.288 హెక్టార్లలో ఫెల్డ్ స్పార్స్ క్వారీ నిర్వహణకు అనుమతులు.
- గుండ్యాల రేంజ్ ఫారెస్ట్‌లో 314, 315, 316, 317 కంపార్ట్మెంట్ నుంచి నమూనాల సేకరణ.
- భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని ఇల్లెందు ప్రాంతంలో మార్బుల్ డిపాజిట్ల అధ్యయనం.
- తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్‌లో నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) ప్రాయోజిత పది ప్రాజక్టులు పూర్తి.
- ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పింపర్కుంట బ్లాక్‌లో 48.80 హెక్టార్లలో మాంగనీస్ ఖనిజం అన్వేషణ.
- కరీంనగర్, సిద్దిపేట జిల్లాల్లో పలుచోట్ల 350 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.1.73 కోట్లతో వివిధ రకాల మినరల్స్ అన్వేషణ.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

