ఖైరతాబాద్, సెప్టెంబర్ 18 : ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్‌ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులను శాంతిచర్చలకు పిలువాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గు రువారం శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
ఏడాదిగా మావోయిస్టులు చర్చలకు సిద్ధమంటూ ప్రకటించినా.. కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ను నిలివేయకుండా మారణకాండ కొనసాగించిందని పేర్కొన్నారు. మావోయిస్టులను చంపే హక్కు ఎవరికీ లేదని స్పష్టంచేశా రు. సమావేశంలో విశ్రాంత జస్టిస్ చం ద్రకుమార్, శాంతిచర్చల కమిటీ ప్రతినిధి అజయ్ బాల్నె, ప్రొఫెసర్ అన్వర్‌ఖాన్, చలపతిరావు పాల్గొన్నారు.