మధిర/ బోనకల్లు/అశ్వాపురం/ఇల్లెందు/చింతకాని, మే 4 : మక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు సోమవారం ఆందోళనలు చేపట్టారు. మధిర వ్యవసాయ మార్కెట్ ఎదుట బీఆర్ఎస్, బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ప్రధాన రహదారిపై బీఆర్ఎస్, సీపీఎం నాయకులు ధర్నా నిర్వహించారు. చిరునోములలో రైతులు బోనకల్లు-ఖమ్మం ప్రధాన రహదారిపై మక్కజొన్న బస్తాలు వేసి ధర్నా నిర్వహించారు.