Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ట్రావెల్ బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తో పాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. మరో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రమాదంపై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు.