హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడింది. వేములపల్లి వద్ద వీ కావేరి ట్రావెల్స్‌కు చెందిన అదుపు తప్పి బోల్తాపడగా.. ఈ ఘటనలో పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో సుమారు 38 మంది వరకు ప్రయాణీకులు ఉన్నారు.
హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్న సమయంలో బస్సు బోల్తాపడింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. అయితే, ప్రమాదంలో ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.