School Fee | ప్రైవేట్లో ఫీజుల మోత.. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధిక ఫీజులు
School Fee | రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత మోగుతున్నది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో భారీగా ఫీజులున్నాయి. సగటు ఫీజు రూ. 41,475గా ఉంది. రాష్ట్రంలో బీటెక్ కనిష్ఠ ఫీజు రూ. 36వేలు కాగా, అంతకంటే బడుల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం.
School Fee | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత మోగుతున్నది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో భారీగా ఫీజులున్నాయి. సగటు ఫీజు రూ. 41,475గా ఉంది. రాష్ట్రంలో బీటెక్ కనిష్ఠ ఫీజు రూ. 36వేలు కాగా, అంతకంటే బడుల్లోనే ఎక్కువగా ఉండటం గమనార్హం. అర్బన్ ప్రాంతాలే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని బడులు కూడా తామేం తక్కువకాదంటున్నాయి. ఈ స్కూళ్లల్లో సగటు ఫీజు రూ.35,104గా ఉంది. అంటే పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ బడుల ఫీజులకు తేడా ఆరువేలే కావడం గమనార్హం. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినవే. అసెంబ్లీకి సమర్పించిన సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ వివరాలు సర్కార్ పొందుపరిచింది. ప్రాంతాలవారీగా, యాజమాన్యాలవారీగా సగటు ఫీజుల వివరాలు సర్కార్ ఈ నివేదిక ద్వారా వెల్లడించింది.
గ్రామీణ ప్రాంతాల్లోని బడుల్లో..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ బడుల్లో తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు రూ. 2,286 మాత్రమే. అదే ఎయిడెడ్ బడుల్లోని తల్లిదండ్రులు రూ. 28,420, ఇతర బడుల్లో రూ.4,907, నాన్ గవర్నమెంట్ స్కూళ్లల్లో రూ. 34,012 చొప్పున ఖర్చుచేస్తుండగా అదే ప్రైవేట్ బడుల్లోని తల్లిదండ్రుల వ్యయం రూ. 35,104గా ఉంది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని సర్కార్ స్కూళ్లల్లో తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చు రూ.3,963 మాత్రమే. అదే ఎయిడెడ్ బడుల్లోని తల్లిదండ్రులు రూ. 32,951, ఇతర బడుల్లో రూ.3,260, నాన్ గవర్నమెంట్ స్కూళ్లల్లో రూ. 38,884 చొప్పున ఖర్చుచేస్తుండగా అదే ప్రైవేట్ బడుల్లోని తల్లిదండ్రుల వ్యయం రూ.41,475గా ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

