Bus Catches Fire | మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి, పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మండలం బండ మైలారం నుంచి కొంపల్లికి వెళ్తుండగా ప్రైవేటు బస్సు.. మేడ్చల్ ఐటీఐ వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రోడ్డుకు పక్కన నిలిపివేశాడు. క్షణాలో మంటలు బస్సంతా వ్యాపించాయి. కొద్ది సమయంలోనే బస్సు దగ్ధమైంది. బస్సులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సు దగ్ధమైందని డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన స్థలానికి మేడ్చల్ పోలీసులు పరిశీలించారు. ప్రమాదానికి కారణాలను ఆరా తీస్తున్నారు.