Speaker Pocharam | ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాకో రైస్‌మిల్.. ఒక్కోదానికి రూ. 250 కోట్ల ఖర్చు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: పోచారం
Speaker Pocharam | ప్రభుత్వం రైతాంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా తయారవుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam)అన్నారు.
బాన్సువాడ : ప్రభుత్వం రైతాంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా తయారవుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి (Speaker Pocharam) అన్నారు. కామారెడ్డి జిల్లా పాత బాన్సువాడ రోడ్డులో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ సహాయ అధికారి కార్యాలయం, రైతుబంధు(Raitu Bandu) సమన్వయ సమితి కార్యాలయం, వ్యవసాయ శాఖ షాపింగ్ కాంప్లెక్స్ లను మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతును కాపాడితే అన్ని కుల వృత్తులు, రంగాలను కాపాడినట్లేనని అభిప్రాయపడ్డారు. ‘ రైతు పక్కకు తప్పుకంటే మిగిలిన రంగాలు, కుల వృత్తులు దెబ్బతింటాయి. రైతు తాను బతకడంతో పాటుగా పదిమందిని బతికిస్తాడు. మంచి పంటలు పండి, రైతుల దగ్గర డబ్బులు ఉంటే కొనుగోలు శక్తి పెరిగి వ్యాపార రంగం బాగుంటుందని’ పేర్కొన్నారు.2014 తరువాత తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం(Agricultural Sector)లో చాలా మార్పులు వచ్చాయని వెల్లడించారు.
రైతుబంధు డబ్బులు రావడంతో బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయని తెలిపారు. రైతులు ఆధునిక పద్దతులపై అవగాహన పెంచుకోవడంతో పాటుగా, నూతన సాంకేతిక (New Technologies) పరిజ్ఞానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ విత్తన భాండాగారమని ఏటా వందల కోట్ల రూపాయల విలువైన విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని స్పీకర్ వివరించారు.
జిల్లాకో రైస్‌మిల్లు..
ప్రైవేట్ మిల్లర్ల బాధలను తప్పించడానికి ముఖ్యమంత్రి జిల్లాకు ఒక రైస్ మిల్లు(Rice mill)ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారని తెలిపారు. ఒక్కో మిల్లుకు రూ. 250 కోట్ల పెట్టుబడి, గంటకు అరవై టన్నుల కెపాసిటీ కలిగి ఉంటుందన్నారు. అనుబంధం పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తారని తెలిపారు. బాన్సువాడ ప్రాంతంలో కూడా ఒక మిల్లు ఏర్పాటు చేస్తారని వివరించారు. పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు బియ్యం లేక పంపించమని తెలంగాణను కోరుతున్నారని తెలిపారు.
వానాకాలం పంటల సాగు కోసం నిజాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీలు ఉండగా అవసరమైన మరో 5 టీఎంసీలు ఇవ్వడానికి సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. పేద ప్రజలను మరోసార మోసం చేసేందుకు నాటకాలు ఆడుతుందని , పెన్షన్‌ను రూ.4వేలు ఇస్తామని మాయమాటలు చెబుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ ఎండీ, అంతర్జాతీయ విత్తన సర్టిఫికేషన్ సంస్థ అధ్యక్షుడు. డాక్టర్ కేశవులు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు డి. అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోర్లం నర్సింహులు, సొసైటీ చైర్మన్ ఎర్వ కృష్ణా రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

