విద్యార్థులను వాతలు వచ్చేలా కొట్టిన ప్రిన్సిపాల్.. అలంపూర్లోని ఫూలే గురుకుల పాఠశాలలో ఘటన
తన అనుమతి లేకుండా పుస్తకాలు, పెన్నులు ఎలా తీసుకుంటారంటూ విద్యార్థులను ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన జోగుళాంబ గద్వా ల జిల్లాలో చోటుచేసుకున్నది.
అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 14 : తన అనుమతి లేకుండా పుస్తకాలు, పెన్నులు ఎలా తీసుకుంటారంటూ విద్యార్థులను ప్రిన్సిపాల్ చితకబాదిన ఘటన జోగుళాంబ గద్వా ల జిల్లాలో చోటుచేసుకున్నది.
వివరాల్లోకి వెళితే.. ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలోని మహాత్మాజ్యోతిరావు ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్షలు ముగిశాయి. ఇండ్ల కు వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న పదో తరగతి పుస్తకాలు, కంపాక్స్లు, పెన్నులను 6, 7, 9వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్థులు తీసుకున్నారు.
తన అనుమతి లేకుండా పుస్తకాలు ఎలా తీసుకుంటారంటూ ఆగ్రహం తో విద్యార్థులను ఓ గదిలో వేసి ప్రిన్సిపాల్ రామకృష్ణ విచక్షణారహితంగా చితకబాదాడు. నడువలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని తల్లిదండ్రులకు ఫోన్లుచేసి చెప్పడంతో మంగళవా రం వారు పాఠశాల వద్దకు చేరుకున్నారు.
ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులకు ఏమీ కాలేదని చూయించడానికి వీలుకాదంటూ గేటుకు తాళంవేశారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ఆందోళన చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

