హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : 10న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ప్రధాని మోదీ సభ నిర్వహించనునట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సభకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రాంచందర్రావు మాట్లాడు తూ ప్రధాని సభకు ‘జనాగ్రహ సభ’గా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. రూ.7వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు.