హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): ప్రాంతీయ భాషలు, సంస్కృతిని కాలరాసేందుకు ప్రధాని మోదీ కుట్ర పన్నుతున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏక భాషా పెత్తనాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. తాను బీజేపీకి రాజీనామా చేసిన లేఖను ట్వీట్‌కు జత చేశారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని, చేనేత వృత్తులపై లేఖ రాస్తే కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.