హైదరాబాద్ : ప్రధాని మోదీ తెలంగాణా పై మరో సారి ద్వంద వైఖరిని బయట పెట్టారు. సీఎం కేసీఆర్ కు జాతీయ రాజకీయాల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక పోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో సీఎం నిరంతర కృషితో రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తున్నది. ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ప్రధాని చెప్పారు.
దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసారి ఆదాయం 87 శాతం ఎక్కువ. రాష్ట్ర పుట్టుక పై విషం చిమ్మిన వ్యక్తి మోదీ. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం విడ్డూరం. ఎన్ని అవమానాలు, అవహేళన చేసినా సీఎం కేసీఆర్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
నదీ జలాల పై వివాదాన్ని కేంద్రం ఇంకా తేల్చడం లేదు. కాళేశ్వరం కు జాతీయ హోదా కోసం వేడుకున్నా స్పందించలేదు. రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం కోచ్ ఫ్యాక్టరీ కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ప్రధాన ప్రాజెక్టును గుజరాత్ కు తరలించి 520 కోట్ల ప్రాజెక్టు ఇక్కడికి ఇస్తావా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ సింగరేణి ని ప్రైవేటీకరణ చేయమని ప్రకటించి మోసం చేశారని మండిపడ్డారు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలేదు. ఆదాని కి 8 ఎయిర్ పోర్టులను అక్రమంగా కట్టబెట్టింది నిజం కాదా? దేశాన్ని నియంతలా పాలించాలన్నదే మోదీ లక్ష్యం. బీజేపీ ద్రోహులను ప్రజలు నిలదియ్యాలని పిలుపునిచ్చారు.