హైదరాబాద్, జూలై 21: విద్యారంగంలో అ గ్రగామిగా నిలుస్తూ ఎందరో విద్యార్థులను విజేతలుగా తీర్చిదిద్దుతున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధిగమించాయి. ప్రపంచ వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు పోటీపడిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్(ఐఎం వో)-2024లో భారత బృందం అద్భుతమైన ప్రతిభను చాటి ప్రపంచ వ్యాప్తంగా నాలుగో స్థా నంలో నిలిచింది. దేశానికి చెందిన ఆరుగురు వి ద్యార్థుల బృందం ఐఎంవోలో నాలుగు బంగా రు, రజత పతకం, గౌరవప్రదమైన ప్రస్తావనతో నాలుగో ర్యాంకులో నిలిచింది.
ఈ బృందంలో శ్రీచైతన్య టెక్నో స్కూల్ బావదాన్ పూణేకు చెం దిన విద్యార్థి ఆదిత్య మంగుడి ఉత్తమ ప్రతిభ కనబర్చడం విశేషం. ఇటీవల బాత్(యూకే)లో ముగిసిన 65వ ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో ఈ ఘనత దక్కింది. ఈ చారిత్రక విజయాన్ని సాధించడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన శ్రీచైతన్య విద్యార్థి ఆదిత్యతోపాటు ఇతర బృందాన్ని ప్రధాని మోదీ ఎక్స్(ట్విట్టర్)వేదికగా అభినందించారు. భారత్‌ను నాలుగో స్థానంలో నిలిపిన విద్యార్థుల బృందానికి శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్లు సుష్మ, సీమ అభినందనలు తెలిపారు. ఆదిత్య తమ స్కూల్లో 6వ తరగతి నుంచే చదువుతున్నాడని, ప్రస్తుతం 12 తరగతి చదువుతున్నాడని, ఐఎంవోలో బంగా రు పతకం సాధించడం వెనుక అంకితభావం, కృషి ఉందని కొనియాడారు.