137.76 కోట్ల పనులకు ప్రధాని శ్రీకారం
తెలంగాణలో స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.137.76 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
హైదరాబాద్, మార్చి 7(నమస్తే తెలంగాణ): తెలంగాణలో స్వదేశీ దర్శన్ 2.0, ప్రసాద్ పథకంలో భాగంగా రూ.137.76 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ గురువారం శ్రీనగర్ నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
హైదరాబాద్ బల్కంపేటలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంసృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అంతకు ముందు మంత్రి జూపల్లి బలంపేట ఎలమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అభివృద్ధి పనుల వివరాలు
- ప్రసాద్ పథకం కింద రూ.4.05 కోట్లతో హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ప్రాంగణంలో నిర్మించిన అన్నదాన భవనం, తాగునీటి సదుపాయం, కెఫేటేరియా, టికెట్ కౌంటర్, తదితర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం.
- ప్రసాద్ పథకంలో రూ.38.90 కోట్లతో గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ దేవి ఆలయంలో ప్రసాద్ సీంలో భాగంగా నిర్మించిన సాంసృతిక భవనం, అన్నదాన సత్రం ప్రారంభం.
- యాదాద్రి-భువనగిరి జిల్లాలోని భువనగిరి కోటను స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.56.81 కోట్ల (ప్యాకేజీ-1)తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కోట ప్రాంతంలో విశ్రాంతి భవనాలు, పారులు, హరిత వనాల అభివృద్ధికి, కోట పైకి చేరుకునేందుకు రోప్‌వే నిర్మించనున్నారు.
- స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ.38 కోట్ల (ప్యాకేజీ-1)తో వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేసే పనులకు శంకుస్థాపన.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

