Asifabad | కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలోనున్న వావుదం గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల అరకొర వసతుల మధ్య గ్రామ పంచాయతీ భవనంలో కొనసాగుతున్నది. ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పాఠశాల మరో మూడు గిరిజన గ్రామాల అడవి బిడ్డలకూ విద్యనందిస్తున్నది. గతంలోని పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడం తో దానిని కూల్చివేసిన అధికారులు కొత్త భవనాన్ని నిర్మించడాన్ని మరిచారు. గత్యంతరం లేక ఈ పాఠశాలను గ్రామ పంచాయతీ భవనంలోకి మార్చా రు.
గ్రామ పంచాయతీ కార్యకలాపాలు నిర్వహించే రోజున విద్యార్థులకు సెలవు ఇవ్వడమో లేక.. ఎక్కడైనా ఆరు బయట పాఠశాల నిర్వహించడమో చేస్తున్నా రు. భవనం నిర్మించాలని గతంలో ధర్నా చేసినా అధికారుల స్పందించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కాప్రి, దెమ్మెడిగూడ, చి ంతగూడ గ్రామాల విద్యార్థులు సైతం ఈ పాఠశాలకే వచ్చి చదువుకుంటారు. నిరుడు 50 మంది చదువుకోగా.. ఈ సారి మరో 20 మంది విద్యార్థులు పెరి గే అవకాశం ఉన్నదని ఉపాధ్యాయులు అంటున్నారు. పాఠశాల భవన నిర్మా ణానికి ఓ వ్యక్తి 30 గుంటలు దానం చే సినా, అధికారులు భవనాన్ని నిర్మించడంలో నిర్లక్ష్యం వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.