హైదరాబాద్, జూన్ 30 (నమ స్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నేపథ్యంలో సా మాన్యులకు సిమెంటు, స్టీల్, ఇటుకలు, ఇసుక అందుబాటులో ఉండేందుకు మండలస్థాయిలో ధరల నిర్ణ య కమిటీలు ఏర్పాటుచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ సమావేశంలో మం త్రులు, సబ్ కమిటీ సభ్యులు ఉత్తమ్, శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సామాన్యులకు ఇసుక అం దుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల బృందం చర్చించింది.
10న క్యాబినెట్ భేటీ! ; పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం?
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): పంచాయతీ ఎన్నికల ప్రక్రియను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ నెల 10న మంత్రివర్గ సమావేశం నిర్వహించి, ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. కానీ బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాలేదు. చట్టం తీసుకురావడం ఇప్పట్లో సాధ్యంకాదని, జీవో ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వంలోని కొందరు నేత లు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. చట్టం చేస్తామని హామీ ఇచ్చి, జీవోతో చేతులు దులుపుకుంటే బీసీలను మోసం చేశారనే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు చెప్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్నికలకు హైకోర్టు గడువు విధించడం, ప్రభుత్వ పరంగా సిద్ధంగా లేకపోవడంతో ముఖ్యనేతలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సచివాలయవర్గాల సమాచారం.