హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గురుకుల ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రోగ్రెసివ్ రికగ్నయిజ్డ్ గురుకుల టీచర్స్ అసోసియేషన్ (పీఆర్జీటీఏపీఆర్టీయూ టీఎస్ అనుబంధం ) కోరింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సీఎంను కలిసిన అసోసియేషన్ నేతలు గురుకుల టీచర్ల సమస్యలను విన్నవించారు.
ముందుగా, సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉప్పు అశోక్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ నిర్మలానందం, కే రామకృష్ణారెడ్డి, పానుగంటి విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు.