హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): గురుకుల పాఠశాల లు, కళాశాలల టైం టేబుల్‌ను మార్చాలని పీఆర్‌జీటీఏ ప్రభుత్వాన్ని కోరింది. పీఆర్‌జీటీఏ ప్రతినిధులు శనివారం సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
010 పద్దుద్వారా జీ తాలు చెల్లించాలని, పదోన్నతులు క ల్పించాలని, సీసీఎల్ మంజూరు, కేర్టేకర్ల నియామకం, డిగ్రీకాలేజీలను ఏర్పాటుచేయాలని కోరారు. పీఆర్‌జీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు వేమిరెడ్డి దిలీప్‌రెడ్డి, నిర్మలానందం, విద్యాసాగర్, రమేశ్, విజయ్‌కుమార్, చెల్క సంజీవరెడ్డి వినతిపత్రాన్ని సమర్పించారు.
ప్రభుత్వ, పంచాయతీరాజ్, కేజీబీ వీ, ఆదర్శపాఠశాలలకు స్కూల్ గ్రాం ట్, స్పోర్ట్స్ గ్రాంట్‌ను విడుదల చేయడంపై పీఆర్టీయూటీఎస్ హర్షం వ్యక్తంచేసింది. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ ప్రకటనలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.