హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పర్యావరణహిత, మైనిం గ్, సోలార్ విద్యుత్తు రంగంలో మెరుగైన సేవలందిస్తున్న సింగరేణి సంస్థ మరో ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైంది. దేశంలోనే అత్యుత్తుమ మైనింగ్ కంపెనీగా ఎనర్షియా ఫౌండేషన్ అవార్డును అందుకోనున్నది. 2024 సంవత్సరానికి ‘ఇండియాస్ బెస్ట్ అండ్ మోస్ట్ సస్టెయినబుల్ కోల్ మైనింగ్ ఆపరేటర్ విత్ రెన్యూవబుల్ ఎనర్జీ అడాప్షన్’ కేటగిరిలో సింగరేణిని అత్యుత్తమ సంస్థగా ఎంపికచేశారు.
ఈ నెల 20న విశాఖపట్నంలో ఈ అవార్డును నిర్వాహకులు అందజేయనున్నారు. సింగరేణివ్యాప్తం గా ఆరు కోట్లపైగా మొక్కలు నాటడంతోపాటు, పంప్డ్స్టోరేజీ, ఫ్లోటిం గ్ సోలార్ ప్లాంట్, కార్బన్డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ వంటి పర్యావరణహిత చర్యలను సింగరేణి తీసుకుంటున్నది. దీంతో సంస్థను ఈ అవార్డు వరించింది. అవార్డుకు ఎంపికవ్వటంపై సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరాం హర్షం వ్యక్తంచేశారు.