వెంకటాపురం (నూగూరు), జూన్ 13: మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పేలి మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మలుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మం డల పరిధిలోని చొక్కాలకు చెందిన 100 మందికి పైగా గ్రామస్థులు కలిసి.. డోలీ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బెడం మల్లన్న దేవుడిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో కర్రిగుట్టల సమీపంలో ప్రెషర్ బాంబు ను డర్రా సునీత తొక్కడంతో అది పే లింది. గాయాలపాలైన ఆమెను గ్రామస్థులు జోలె కట్టుకొని 25 కిలోమీటర్ల దూరంలోని మల్లాపురం గ్రామ సమీపంలోని పాలెం ప్రాజెక్ట్ వద్దకు తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం కోసం భద్రాచలంలోని దవాఖానకు తరలించారు.