హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె విడిది చేయనున్నారు.
20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్లో గ్లోబల్ పీస్ కమిటీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న వివిధ రంగాల ప్రతినిధులతో భేటీ అవుతారు. 22న ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.