20న పోచంపల్లికి రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు.
- చేనేత వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవన శైలిని తెలుసుకోనున్న ద్రౌపది ముర్ము
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 7 : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి రానున్నారు. పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, వీవింగ్, కార్మికుల జీవనశైలిని తెలుసుకోనున్నారు. రాష్ట్రపతి రాక సందర్భంగా వీవర్స్ సర్వీస్ సెంటర్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ అనిల్‌కుమార్ గురువారం యాదాద్రి అదనపు కలెక్టర్ భాసరరావుతో కలిసి పోచంపల్లిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ఈ నెల 18న హైదరాబాద్ వస్తున్నారని, ఇందులో భాగంగా 20న ఉదయం 11:10 గంటలకు ఆమె భూదాన్ పోచంపల్లికి రానున్నట్టు ఆయన పేర్కొన్నారు. సంత్ కబీర్, పద్మశ్రీ జాతీయ అవార్డులు పొందిన వారు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 16 మంది ఉన్నారని, అందులో ఐదు నుంచి పది మందిని ఎంపిక చేసి రాష్ట్రపతితో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ హ్యాండ్లూమ్, టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో తెలంగాణ ఔనత్యాన్ని ప్రతిబింబించేలా ప్రదర్శన ఉంటుందని చెప్పారు. తెలంగాణ చేనేత వస్త్రాలు గొల్లభామ, పోచంపల్లి ఇకత్ వస్త్రాలు, నారాయణపేట, గద్వాల వస్ర్తాలు, పుట్టపాక తెలియా రుమాలును ప్రదర్శనకు ఉంచనున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాలుగు మగ్గాలపై తెలియా రుమాలు, పోచంపల్లి ట్రెడిషనల్, డబుల్ ఇకత్, పోచంపల్లి లేటెస్ట్ వస్త్రాలను నేసేలా ఏర్పాటు చేస్తారని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

