హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసింది. శుక్రవారం ఉదయం శిల్పారామంలో నిర్వహించిన లోక్‌మంథన్ సదస్సుకు హాజరై ప్రసంగించారు.
అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఆమెకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క జ్ఞాపిక అందించి వీడ్కోలు పలికారు.