రామగిరి, సెప్టెంబర్ 15: యూనివర్సిటీలు విద్యార్థులను కొత్త సాంకేతికత, పరిశ్రమలు, విద్య, ఉపాధిని పునర్నిర్మించడానికి సిద్ధంగా ఉన్న కృత్రిమ మేధస్సుకు సిద్ధం చే యాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 4వ కాన్వకేషన్ అట్టహాసంగా సాగింది. చాన్స్‌లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. 57 మంది పీజీ విద్యార్థులకు బంగారు పతకాలు, పీహెచ్డీ పూర్తి చేసిన 22 మంది విద్యార్థులకు కాన్వకేషన్ పట్టాలను ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు బీఎస్ మూర్తితో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యారంగం, పరిశోధన, ఆ విషరణలు, సేవా కార్యకలాపాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్న మహాత్మా గాంధీ వర్సిటీ గ్రామాల నుంచి ఎకువ మంది విద్యార్థులను ఆకర్షించడం హర్షణీయమని కొనియాడారు. ఐఐటీ హైదరాబాద్ సంచాలకుడు బీఎస్ మూర్తి, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ యూనివర్సిటీ అభివృద్ధితోపాటు భవిష్యత్తులో అమలు చేసే నూతన కోర్సుల విషయాలను వెల్లడించారు. గవర్నర్‌ను నల్లగొండ ఎంపీ కుందూరి రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నాయకుడు అద్దంకి దయాకర్ మార్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, రిజిస్ట్రార్ అల్వాల రవి, గవర్నర్ ఏడీసీ భవానీప్రసాద్, ఎంజీయూ సీవోఈ ఉపేందర్‌రెడ్డి, ఇన్ఫ్రాస్రక్టర్ డైరెక్టర్ ఆకుల రవి పాల్గొన్నారు.