హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతిలో ఉత్త మ ఫలితాల సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా అడుగులేస్తున్న ది. ‘లక్ష్య’ ప్రత్యేక కార్యక్రమంతో యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించింది. సబ్జెక్టుల వారీగా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ప్రత్యేక కరదీపికలను రూపొందించి, ఇటీవలే విడుదల చేసింది. విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసి, అర్థవంతమైన అభ్యాసాలు చేయించి, పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేలా చేయడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. బట్టీ విధానానికి దూరం గా, మైండ్ మ్యాపింగ్ ద్వారా, విద్యార్థి తన సొంతమాటల్లో రాసేలా, స్వీయ రచన చేసేలా ప్రోత్సహిస్తారు. దీంట్లో భాగంగా సగం రోజులు బోధనకు, మరో సగం రోజులను పరీక్షల సన్నద్ధతకు కేటాయిస్తారు. సందేహాల నివృత్తికి జిల్లా, రాష్ట్రస్థాయిలో టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తారు.
యాక్షన్‌ప్లాన్ అమలు ఇలా..