108లోనే పురుడు
ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం 108లో ఈఎంటీ పురుడు పోసిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది.
- నిరుపేదకు అందని ప్రభుత్వ వైద్యం
- నెలలు నిండలేదనే కారణంతో మూడు చోట్ల వైద్యానికి నిరాకరణ
ములుగు, జూన్ 3 (నమస్తేతెలంగాణ):ములుగు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీకి ప్రభుత్వ వైద్యం అందకుండాపోయింది. నెలలు నిండలేదని ములుగు జిల్లాలోని మూడు ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు కాన్పు చేసేందుకు నిరాకరించడంతో వందల కిలోమీటర్ల ప్రయాణం అనంతరం 108లో ఈఎంటీ పురుడు పోసిన ఘటన సోమవారం చోటుచేసుకున్నది.
వాజేడు మండల కేంద్రానికి చెందిన దబ్బకట్ల సుధాకర్ భార్య నాగలక్ష్మి గర్భిణీ కావడంతో ప్రతి నెలా వాజేడు పీహెచ్సీలో వైద్యం పొందుతున్నది. ఆదివారం సాయంత్రం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు లేకపోవడంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు వెళ్లారు.
అక్కడికి వచ్చిన నాగలక్ష్మిని పరీక్షించిన వైద్యులు నెలలు పూర్తిగా నిండలేదని కుటుంబ సభ్యులకు చెప్పి ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు 108 ద్వారా తరలించారు. ములుగు దవాఖానకు రాత్రి చేరుకున్న సదరు గర్భిణికి వైద్యం అందించాల్సిన వైద్యులు రిస్క్ డెలివరీ పేరుతో మరో 108 వాహనంలో హనుమకొండలోని గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు.
ములుగు నుంచి 108లో హనుమకొండకు వెళ్తుండగా కటాక్షపూర్‌కు చేరుకునేలోగా నాగలక్ష్మి పురిటి నొప్పులు తీవ్రం కావడంతో పైలట్ కొలగాని శ్రీను వాహనాన్ని పక్కకు ఆపాడు. ఈఎంటీ నరేశ్.. నాగలక్ష్మికి పురుడు పోయగా, ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ములుగు ప్రభుత్వ దవాఖాన వైద్యులకు ఈఎంటీ తెలుపగా వారి సూచన మేరకు జీఎంహెచ్‌కు తరలించారు. అక్కడ తల్లీబిడ్డను పరీక్షించిన వైద్యులు వారు క్షేమంగా ఉన్నట్టు తెలిపి రెండు రోజులపాటు వైద్యం అందించేందుకు అడ్మిట్ చేసుకున్నారని ఈఎంటీ నరేశ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
Graduates Registration | గ్రాడుయేట్ల ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Yash | నిజ జీవితంలో నేను రాముడిని.. తెరపై రావణుడిని: యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Kagiso Rabada | టెస్ట్ క్రికెట్లో చరిత్ర సృష్టించిన రబాడా.. తక్కువ బంతులేసి ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

