హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : పీఆర్సీ నివేదికను తెప్పించుకుని నూతన ఫిట్‌మెంట్‌ను ప్రకటించాలని, పెండింగ్‌లోని నాలుగు డీఏలను వెంటనే మంజూరుచేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీఎస్ యూటీఎఫ్ కార్యదర్శివర్గ సమావేశాన్ని బుధవారం దోమల్‌గూడలోని కార్యాలయంలో నిర్వహించగా, నర్సిరెడ్డి పాల్గొని మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, సరెండర్ లీవు, జీపీఎఫ్, పార్ట్‌ఫైనల్ లోన్స్, పదవీ విరమణ అనంతర బిల్లులను చెల్లించకపోవడం విడ్డూరమన్నారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావ రవి, సీహెచ్ రాములు, సీహెచ్ దుర్గాభవాననీ, టీ లక్ష్మారెడ్డి, పీ మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు.