యాదాద్రిలో ప్రసాదాల ధరలు పెంపు

- నిత్య కైంకర్యాలు కూడా..కొత్త ధరలు నేటి నుంచి అమలు
యాదాద్రి, డిసెంబర్ 9: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో నిర్వహించే స్వామివారి నిత్య కైంకర్యాలు, శాశ్వత పూజలతోపాటు స్వామివారి ప్రసాదం లడ్డూ, పులిహోర ధరలను పెంచుతూ ఆలయ ఈవో ఎన్ గీత గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీంతోపాటు ఉద్యోగులకు పెంచిన పీఆర్సీతో ఆలయానికి నెలకు దాదాపు రూ.2 కోట్ల భారం పడుతుందని తెలిపారు. అనివార్య పరిస్థితుల్లోనే ధరలు పెంచాల్సి వచ్చిందని ఆమె వివరించారు. గతంలో వంద గ్రాముల స్వామివారి లడ్డూ రూ.20 ఉండగా, రూ.10 పెంచి మొత్తం రూ.30గా నిర్ణయించారు. అభిషేకం (500 గ్రాముల) లడ్డూ వంద నుంచి రూ.150, సువర్ణ పుష్పార్చన రూ.516 నుంచి రూ.600కు పెరిగింది. వేద ఆశీర్వచనం రూ.516 నుంచి రూ.600కు, నిత్యకల్యాణం రూ.1,250 ఉండగా రూ.1,500కు పెంచారు. స్వామివారి నిజాభిషేకం రూ.500 నుంచి రూ.800, సహస్ర నామార్చన రూ.216 నుంచి రూ.300కు, లక్ష పుష్పార్చన రూ.2,116 ఉండగా రూ.2,500, స్వామివారి వెండి మొక్కు జోడు సేవలు రూ.500 ఉండగా రూ.700కు, సత్యనారాయణస్వామి వ్రతాలు (సామగ్రితో) రూ.500 ఉండగా రూ.800కు పెంచారు. వీటితోపాటు ఆలయంలో భక్తులతో నిర్వహించే వివిధ రకాల పూజల ధరలు కూడా పెంచినట్టు ఈవో గీత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

