హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను టీజీజెన్కో ఆధ్వర్యంలోనే నిర్మించాలని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ డి మాండ్ చేసింది. జేఏసీ పిలుపు మేర కు రాష్ట్రవ్యాప్తంగా జెన్కో ఆఫీసుల ఎదుట శుక్రవారం ఆందోళన చేశారు. మింట్‌కాంపౌండ్ ఎస్పీడీసీఎల్ ఆఫీసు వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, జనప్రియ, వేణు, గంగాధర్ పాల్గొన్నారు.
సీజ్ చేసిన గంజాయి దహనంస
హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీగా గంజాయి పట్టుబడుతున్నది. ఇటీవల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్న గంజాయిని శుక్రవారం దహనం చేశారు. ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, అశ్వరావుపేట, మణుగూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 22 కేసుల్లో రూ.4కోట్ల విలువచేసే వెయ్యి కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈడీ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి నేతృత్వంలో అసిస్టెంట్ కమిషనర్ గణేశ్ గంజాయిని ద హనం చేయించారు. 1.87 కోట్ల మద్యాన్ని సైతం ధ్వంసం చేసినట్టు తెలిపారు.