ధరూర్, ఆగస్టు 10 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్‌పై పవర్ గేట్లు తెరుచుకోకపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆదివారం ఉదయం 5 గంటలకే బయట నుంచి క్రేన్ తెప్పించి గేట్లు ఎత్తే సమయంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పవర్ లిఫ్టింగ్ ద్వారా తెరుచుకోవాల్సిన గేట్లు ఎందుకు ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ను వాడి ఎత్తాల్సి వచ్చిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఈ విషయాన్ని కప్పిపెడుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రాజెక్టు అధికారిని వివరణ కోరగా.. వాటర్ ప్రెషర్ వల్ల గేట్లు తెరుచుకోవడం లేదని, దాని వల్లే ఎక్స్టర్నల్ ఎక్విప్మెంట్ను వాడి లిఫ్టు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అప్పుడప్పుడు ఇలా జరుగుతుందని పేర్కొన్నారు.