హైదరాబాద్ : రాష్ట్రంలో ఎక్కడా ఒక్కసారి కూడా కరెంట్ పోవడం(Power cuts) లేదని, 24 గంటలు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు తాగు నీటి కోసం ఇబ్బందులు పడ్డ ప్రజలు.. ఇప్పుడు తీవ్ర కరెంట్ కోతలతో ఉక్కపోత భరించలేక అల్లాడిపోతున్నారు. తాజాగా మంచిర్యాల(Manchiryala) జిల్లా కేంద్రంలోని సాయికుంట, శ్రీశ్రీనగర్, రాజరాజేశ్వర కాలనీ, కాకతీయ కాలనీ, తోళ్లవాగు ఏరియా, సున్నంబట్టి వాడ (మంచిర్యాల టౌన్-3)లో కరెంట్ లేక కష్టాలు పడుతున్నారు.
మంగళవారం సాయంత్రం 6 గంటలకు కరెంట్ పోయి ఎంత సేపైనా రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై ఆయా ప్రాంతాల వాసులు ట్రాన్స్కో ఏఈ నర్సయ్యకు ఫోన్ చేయగా.. సమస్య ఏంటో తెలియడం లేదని సమాధానం చెప్పినట్టు సమాచారం. నెల రోజులుగా ప్రతి రోజూ తమ ప్రాంతాల్లో కరెంట్ పోతుందంటూ కాలనీల వాసులు వాపోతున్నారు. దీనికి విరుద్ధంగా రాష్ట్రంలో అసలు కరెంటే పోవడం లేదని మంత్రులు చెప్పడం గమనార్హం.
కొన్ని నెలలుగా కరెంట్ కోతలతో అవస్థలు పడుతున్న మంచిర్యాల జిల్లా వాసులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయికుంట, శ్రీశ్రీనగర్, రాజరాజేశ్వర కాలనీ, కాకతీయ కాలనీ, తోళ్లవాగు ఏరియా, సున్నంబట్టి వాడ (మంచిర్యాల టౌన్-3)లో మంగళవారం సాయంత్రం 6 గంటలకు కరెంట్ పోయి ఎంత సేపైనా రాకపోవడంతో ప్రజలు… pic.twitter.com/XqxuDrz6I4
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2024