హైదరాబాద్, మే 9 నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని పీవోడబ్ల్యూ సంధ్య కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి ఆగడాలపై శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. మైనర్‌పై కేంద్ర మంత్రి కొడుకు అఘాయిత్యం చేసిన ఘటనలో బాధితులు పేట్ బషీర్బాద్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెడితే ఎందుకు స్వీకరించలేదు?. హనీట్రాప్ కేసు ఎలా పెడతారు?. మైనర్ చేతిలో మేజర్ ఎలా హనీట్రాప్‌కు గురవుతాడు?. బండి భగీరథ్ నేరం కేసులో ఎందుకు జాప్యం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. పోలీసులు ఉన్నది ఎవరికీ గులాంగిరీ చేయడానికి కాదు.. ఎవరో చిన్న నేరం చేస్తే కొట్టి లాకప్‌డెత్‌కు పాల్పడుతారు.. ప్రశ్నిస్తే ఇష్టమొచ్చిన కేసులు పెడ్తారు.. అని మండిపడ్డారు. బండి కుమారుడిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు