హైదరాబాద్ సిటీబ్యూరో, ఏపిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ అధికారిగా పీవీ నారాయణరావు వ్యవహరించారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా కాసర్ల మోహన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఉప్పల నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఉడుతల భాస్కర్‌రావు, కార్యదర్శిగా పోతూరి వెంకట్రావు, కోశాధికారిగా వంగేటి అభిషేక్‌రెడ్డి ఎన్నికయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా మోముల సుధాకర్‌రెడ్డి, పురుమండ్ల శ్యామ్‌సుందర్‌రెడ్డి, సిద్దెంకి జగన్మోహన్రెడ్డి, త్రిపురనేని సుబ్రహ్మణ్యం, వేముల రవీందర్‌రెడ్డి, గంధంనేని వినయ్‌ప్రసాద్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ వచ్చే ఐదేండ్ల పాటు పదవిలో ఉంటుంది.