Korean Kanakaraju | కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ.. వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఈ సారి టాలీవుడ్లో ఇప్పటివరకు రాని ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు.
Varun Tej | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగాలతో దూసుకుపోతున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన, ఈ సారి టాలీవుడ్లో ఇప్పటివరకు రాని ఒక వినూత్నమైన కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు. వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘కొరియన్ కనకరాజు’ (KoreanKanakaraju). టాలీవుడ్ హిస్టరీలోనే సరికొత్తగా ఒక ఇండో-కొరియన్ హారర్ కామెడీ జానర్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. 2026 ఆగస్టు 7వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ’ అంటూ విడుదల చేసిన ఈ క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ చిత్రానికి దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. తనదైన మార్క్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించడంలో దిట్ట అయిన గాంధీ, ఈ సారి హారర్ ఎలిమెంట్స్‌కు కొరియన్ బ్యాక్‌డ్రాప్‌ను జోడించి ఈ ‘కోకా’ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తుండగా, స్టార్ కామెడియన్ సత్య కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు టి-సిరీస్ సౌత్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, వంశీ, మనోజ్ రెడ్డి సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరిస్తుండటం విశేషం. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సత్య జి. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్లోనే ఇదొక అత్యంత క్రేజీ మరియు వైల్డెస్ట్ రైడ్‌గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. కొరియన్ కల్చర్‌కు, మన లోకల్ కామెడీకి నడుమ సాగే ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆగస్టు 7న థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ కొరియన్ కనకరాజు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

