 
                                                            రామాయంపేట, అక్టోబర్ 30 : మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌లో గురువారం విద్యుదాఘాతంతో పౌల్ట్రీ రైతు రాగుల మోహన్(37) మృతిచెందాడు. ప్రతిరోజూ లాగే మోహన్ గురువారం పౌల్ట్రీఫాం వద్దకు వెళ్లాడు. కోళ్ల ఫారానికి కరెంట్ సరఫరా కాకపోవడంతో తీగలు సరిచేస్తుండగా విద్యుత్తుషాక్‌కు గురై అపస్మారక స్థితికి చేరారు.
అతడిని రామాయంపేట ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలికి వెళ్లి పంచనామా నిర్వహించి, మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 
                            