మొయినాబాద్, ఫిబ్రవరి 6: ఆలూ చిప్స్ గొంతులో అడ్డంపడి ముక్కు పచ్చలారని చిన్నారి మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్టాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు, ఉత్తరప్రదేశ్‌కి చెందిన కూలీలు మొయినాబాద్‌కు వలస వచ్చారు.
ఆరు నెలలుగా తోలుకట్టాలోని ఓ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్నారు. గురువారం 20 నెలల చిన్నారికి చిప్స్ తినిపించగా గొంతులో ఇరుక్కుంది. దవాఖానకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ఊపిరందక చిన్నారి మృతి చెందిందని నిర్ధారించారు.