హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్‌కు వెళ్లిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. వాణీప్రసాద్‌ను కార్మికశాఖ ముఖ్యకార్యదర్శిగా, వాకా టి కరుణను ఆరోగ్యం కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా నియమించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీ, టూరిజం అథారిటీ సీఈవో బా ధ్యతలను అమ్రపాలికి అప్పగించారు.