హైదరాబాద్, అక్టోబర్31 (నమస్తే తెలంగాణ): ప్రభు త్వం ఎట్టకేలకు ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్‌కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చింది. ఉద్యోగ విరమణ రోజే కరీంనగర్ ఈఎన్సీగా నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిరుడు ప్రాథమిక నివేదికను అం దజేసింది. దానిని అధ్యయనం చేసి, సిఫార్సు మేరకు పునరుద్ధరణ పనులను చేపట్టేందుకు ప్రభుత్వం ఈఎన్సీ (జనరల్) అనిల్‌కుమార్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్ దిగువన ఏర్పడిన బొయ్యారాన్ని గ్రౌటింగ్ చేయించారు. అయితే కమిషన్ సూచనల మేరకే గ్రౌటింగ్ చేయించానని ఈఎన్సీ అనిల్‌కుమార్ స్టేట్మెంట్ ఇవ్వగా, అది అబద్ధమని కమిషన్ వెల్లడించింది. అనిల్‌కుమార్‌ను ఈఎన్సీ జనరల్‌గా తప్పించి సెక్రటేరియట్‌కు రిపోర్టు చేయాలని గత జూలై లో ప్రభుత్వం ఆదేశించింది. నాటినుంచి అనిల్‌కుమార్‌కు ప్రభుత్వం ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ క్ర మంలో శుక్రవారం ఆయన విరమణ పొందగా, అదే రోజు కరీంనగర్ ఈఎన్సీగా అనిల్‌కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.