హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామానికి చెందిన రైతు బండారి రవీందర్ ముగ్గురు ఆరేండ్లలోపు కుమార్తెలకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా గజ్వేల్ ఏఎంసీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆర్థికసాయం అందజేశారు. కేసీఆర్ 72వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో రూ.24 వేల చొప్పున ముగ్గురికీ రూ.72 వేల పోస్టల్ డిపాజిట్ల బాండ్లను స్నేహిత, లౌక్యశ్రీ, రిశికకు అందజేశారు. చిత్రంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.