హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. స్వేచ్ఛ కూతురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పూర్ణచందర్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది. పూర్ణచందర్ శనివారం చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపో గా, పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, బీఎన్ఎస్ 69, 108తోపాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
స్వేచ్ఛను పెళ్లి పేరుతో నమ్మించి సహజీవనం చేశారని, పెళ్లి చేసుకోకుండా మోసం చేశారని, ఆత్మహత్యకు ఉసిగొల్పారని అభియోగాలు పేర్కొన్నా రు. పూర్ణచందర్‌కు వైద్యపరీక్షలు నిర్వహించి, ఆదివారం కోర్టులో హా జరుపరిచారు. కోర్టు అతడికి 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. పూర్ణచందర్‌పై స్వేచ్ఛ తండ్రి శంకర్ ఇచ్చిన ఫిర్యాదు, స్వేచ్ఛ కూతురు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.